ఐసిసి పురుషుల వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్‌లో అప్ఘానిస్తాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని తరౌబాలో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి, దక్షిణాఫ్రికా జట్టు టి-20 చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.
ఈ సీరీస్‌లో మొదటినుంచీ మంచి ప్రతిభ కనబరిచిన అప్ఘానిస్తాన్ జట్టు కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ టీమ్, 11.5 ఓవర్లు మాత్రమే ఆడి 56 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆద్యంతం ఆధిపత్యం చూపి, అప్ఘాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టి-20 సెమీస్‌లో ఒక జట్టు వంద పరుగులలోపే ఆలౌట్ అవడం ఇదే మొదటిసారి.
చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీలు పెద్దగా కష్టపడలేదు. ఓపెనర్ డికాక్ 5 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ (29 నాటౌట్), వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మార్‌క్రమ్ (23 నాటౌట్) జాగ్రత్తగా ఆడి 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసారు. దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.
3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన సఫారీ బౌలర్ మార్కో జాన్‌సెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఈ రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గయానాలో జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో విజేత ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి బార్బెడోస్, బ్రిడ్జిటౌన్‌లో జరుగుతుంది.