జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
జూన్ 11న దోడా జిల్లాలో చటర్ గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరుసటి రోజు అంటే జూన్ 12న గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులు దాడికి దిగడంతో ఓ పోలీసు గాయపడ్డారు.
ఉగ్రవాదుల వరుసదాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9:50 గంటల ప్రాంతంలో గండోహ్ ప్రాంతంలోని బజాద్ గ్రామ పరిధిలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.