స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.ఉదయం ప్రారంభంలో స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 712 పాయింట్ల లాభంతో, 78053 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 183 పాయింట్ల లాభంతో 23721 పాయింట్ల గరిష్ఠ రికార్డుల వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. యాక్సెస్, ఐసిఐసిఐ, టెక్ మహింద్రా, హెచ్డిఎఫ్సి, ఎల్ అండ్ టీ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడిచమురు ధర బ్యారెల్ స్వల్పంగా పెరిగి 85.61 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు దూసుకెళ్లాయి. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2345 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.