టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో మరో సంచలనం నమోదైంది. అఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరింది. సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 105 పరుగులు మాత్రమే చేయగల్గింది. అప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ నవీనుల్ హక్, రషీద్‌ఖాన్ పదునైన బంతులకు బెంబేలెత్తిన బంగ్లాదేశ్ బ్యాటర్లు వరుసగా వికెట్లు పారేసుకున్నారు. హక్, రషీద్ చెరో నాలుగు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఓపెనర్ లిటన్‌దాస్ (54) చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జట్టుకు ఓటమి తప్పలేదు. ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు. లిటన్‌దాస్ తర్వాత తౌహిద్ హృదయ్(14) దే అత్యధిక స్కోర్.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్(43), ఇబ్రహీం జద్రాన్(18), అజ్మతుల్లా(10), కెప్టెన్ రషీద్‌ఖాన్(19) పరుగులు చేశారు.
అప్ఘన్ గెలుపుతో సెమీఫైనల్ సమీకరణాలు మారిపోయాయి. అఫ్ఘనిస్తాన్ ఓడితే సెమీస్‌కు వెళ్లొచ్చని భావించింది. అలా జరగకపోవడంతో ఆసీస్ జట్టు స్వదేశానికి పయనం అవుతోంది.
గ్రూప్-1లో భారత్, అఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా, గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఎల్లుండి సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్-1 జరగనుండగా, అదే రోజు భారత్-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్-2 జరుగుతుంది.