దేశ చరిత్రలో మొదటిసారి స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీయే కూటమి తరపున ఓంబిర్లా నామినేషన్ వేయగా, కాంగ్రెస్ నుంచి కె. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది.
లోక్సభలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. గెలిచే అవకాశాలు లేకపోయినా, కె.సురేష్తో నామినేషన్ వేయించారు. రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది.