నాడు దేశాన్ని జైల్లోపెట్టిన పార్టీ వారసులు, నేడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటితో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల స్వేచ్ఛను కాలరాసి, దేశాన్ని జైల్లో పెట్టిన నేతలు నేడు ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారని ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
లోక్సభలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనూ కాంగ్రెస్ సభ్యులు రాజ్యాంగం ప్రతులను చూపుతూ ఆందోళన చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతోందంటూ నినాదాలు చేశారు. ఐదు దశాబ్దాల కిందటే రాజ్యాంగాన్ని కాలరాసి, రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోయినా, ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. అలాంటి ఘోరమైన తప్పిదం మరోసారి జరగకూడదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వణుకు పుట్టించాయి. రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎమర్జెన్సీ విధించిన నాయకులు, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని మోదీ తప్పుపట్టారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు