మరోసారి స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్దమైంది. ఇవాళ ఢిల్లీలో స్పెక్ట్రం వేలం నిర్వహించనున్నారు. మూడు ప్రధాన కంపెనీలు వేలంలో పాల్గొనే అవకాశముంది. 10522 మెగా హెడ్జ్ స్పెక్ట్రం వేలం ద్వారా కేంద్రానికి రూ.96 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు పొల్గోనున్నాయి. వేలంలో దక్కించుకున్న కంపెనీలు 20 సంవత్సరాల్లో 20 సమాన వాయిదాల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
తాజాగా స్పెక్ట్రం వేలం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యం కలగనుంది. ఇంటర్నెట్ వేగం మరింత పుంజుకుంటుంది. 800 మెగా హెడ్జ్ నుంచి 10522 మెగాహెడ్జ్ వరకు మూడు కంపెనీలు స్పెక్ట్రం దక్కించుకునే అవకాశముంది. రాబోయే 20 సంవత్సరాలపాటు ప్రజల అవసరాలు తీర్చే విధంగా కేంద్రం స్పెక్ట్రం అందుబాటులోకి తీసుకురానుంది.