ఐసిసి మెన్స్ టి-20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో సూపర్8లో తమ ఆఖరి మ్యాచ్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. సెయింట్ లూసియాలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్ 6 పాయింట్లతో గ్రూప్-1లో అగ్రస్థానం సాధించింది.
టాస్ ఓడిన భారత్, తొలుత బ్యాటింగ్ చేసింది. ఆట మొదలైన రెండో ఓవర్లోనే కోహ్లీ డకౌట్ అయేసరికి భారత్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. భారత్ మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ బాగా ఆడారు. ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులు చేసాడు. మిచెల్ మార్ష్ 28 బాల్స్‌లో 37 పరుగులు స్కోర్ చేసాడు. తర్వాత భారత బౌలర్లు చెలరేగిపోవడంతో కంగారూలు కంగారుపడాల్సి వచ్చింది. 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు నష్టపోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా భారత్ 24 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
స్కోర్ వివరాలు:
భారత్:
రోహిత్ శర్మ (బి) స్టార్క్ 92
విరాట్ కోహ్లి (సి) డేవిడ్ (బి) హేజిల్‌వుడ్ 0
రిషభ్ పంత్ (సి) హేజిల్‌వుడ్ (బి) స్టాయినిస్ 15
సూర్యకుమార్ యాదవ్ (సి) వేడ్ (బి) స్టార్క్ 31
శివమ్ దూబే (సి) వార్నర్ (బి) స్టాయినిస్ 28
హార్దిక్ పాండ్యా నాటౌట్ 27
రవీంద్ర జడేజా నాటౌట్ 9
ఎక్స్‌ట్రాలు 3
మొత్తం : 205/5
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) అర్ష్‌దీప్ 6
ట్రావిస్ హెడ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 76
మిచెల్ మార్ష్ (సి) అక్షర్ పటేల్ (బి) కుల్‌దీప్ 37
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (బి) కుల్‌దీప్ 20
మార్కస్ స్టాయినిస్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 2
టిమ్ డేవిడ్ (సి) బుమ్రా (బి) అర్ష్‌దీప్ 15
మ్యాథ్యూ వేడ్ (సి) కుల్‌దీప్ (బి) అర్ష్‌దీప్ 1
ప్యాట్ కమిన్స్ నాటౌట్ 11
మిచెల్ స్టార్క్ నాటౌట్ 4
ఎక్స్‌ట్రాలు 9
మొత్తం 181/7