ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తిగిలింది. మద్యం విధాన రూపకల్పనలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆయనకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిన్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, మంగళవారం హైకోర్టు తీర్పు వెలువడిన తరవాత తాము విచారణ చేపడామని వెల్లడించింది.
ఢిల్లీ హైకోర్టు కనీసం సెషన్సు కోర్టు ఆర్డర్ పరిశీలించకుండానే స్టే ఇవ్వగలిగినప్పుడు, హైకోర్టు తీర్పు కోసం మీరెందుకు ఆగుతున్నారంటూ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులో ఒకవేళ తప్పు జరిగి ఉంటే అలాంటి తప్పు తాము చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. రేపు హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ స్టేపై విచారణ జరగనుంది.