ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చిన పథకాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక ఫించన్లు రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, నైపుణ్య గణనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది.
క్యాబినెట్ భేటీ తరవాత సీఎం చంద్రబాబు, మంత్రులతో భేటీ కానున్నారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇసుక, మద్యం పాలసీలపై కూడా క్యాబినెట్లో చర్చకు వచ్చింది. గత ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. దానిపై చర్చ జరిగింది. ఇక ఇసుక ధరలు సామాన్యులకు అందకుండా ఉన్నాయి. వాటిని తగ్గించడం లేదా ఉచితంగా ఇవ్వాలా అనే దానిపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. మంత్రులతో విడిగా మాట్లాడిన తరవాత సీఎం వీటిపై తుది నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది.