తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 57కు పెరిగిందని జిల్లా యంత్రాంగం ఈ ఉదయం అధికారికంగా వెల్లడించింది. ఆ ఘటనలో మొత్తం 156మంది రాష్ట్రంలోని వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
కల్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో 110మంది చికిత్స పొందుతున్నారు. 12మంది పుదుచ్చేరిలోను, 20 మంది సేలంలోను, నలుగురు విలుప్పురంలోను చికిత్స పొందుతున్నారు. మరో ఏడుగురిని డిస్చార్జ్ చేసారు.
ఇప్పటివరకూ కల్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో 32 మంది, సేలంలోని మోహన్ కుమారమంగళం వైద్య కళాశాల ఆస్పత్రిలో 18మంది, విలుప్పురం వైద్య కళాశాల ఆస్పత్రిలో నలుగురు, పుదుచ్చేరి జిప్మెర్ ఆస్పత్రిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
గత బుధవారం అంటే జూన్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు సిబిసిఐడి విచారణ ప్రారంభించింది. ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేసారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు