ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత తొలిసారిగా ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. కాసేపట్లో వెలగపూడిలోని సచివాలయంలో క్యాబినెట్ సమావేశమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ, సామాజిక ఫించన్లు రూ.4వేలకు పెంచడం, స్కిల్ గణన, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు వంటి ఫైళ్లపై సీఎం చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు. వాటికి ఇవాళ క్యాబినెట్ ఆమోదం తీసుకోనున్నారు.
ముఖ్యంగా అసైన్డు భూముల రిజిస్ట్రేషన్ల రద్దుపై కూడా క్యాబినెట్ కీలకంగా చర్చించనుందని తెలుస్తోంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కూడా చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణపై కూడా చర్చించనున్నారు. మంత్రులంతా ఇప్పటికే బాధ్యతలు తీసుకోవడంతో ప్రతి శాఖలో గత ఐదేళ్లుగా జరిగిన అరాచకాలపై శ్వేతపత్రాలు విడుదల చేసే విషయంపై క్యాబినెట్ చర్చించనుంది.