నేటి నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు సమావేశాలు మొదలవుతాయి. అంతకు ముందు సీనియర్ ఎంపీ భర్తృహరితో రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయిస్తారు. ఆ తరవాత సభలో కొత్తగా ఎంపికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గంటకు 26 మంది చొప్పున మొదటి రోజు 280 మందితో ప్రమాణం చేయించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. మిగిలిన వారితో రేపు ప్రమాణం చేయిస్తారు.
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకునే అవకాశముంది. ఇప్పటికే ఆయనకు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. 26వ తేదీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తారు. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. జులై 3 వరకు సమావేశాలు జరపనున్నారు. ఆ తరవాత జూన్ 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చిలో తాత్కిలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. జులై 22 నుంచి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు