ప్రముఖ రెజ్లర్ భజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ వేటు వేసింది. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు క్రీడాకారులు నాడాలో యాంటీ డోపింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పరీక్షలు చేసేందుకు భజరంగ్ పునియా మూత్ర నమూనాలు ఇవ్వలేదని నాడా వేటు వేసింది. కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో భజరంగ్ పునియాపై వేటు పడింది. దీంతో ఆయన అంతర్జాతీయ క్రీడల్లో పొల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.
నాడా నిర్వహిస్తోన్న పరీక్షలు కాలం చెల్లిన పరికరాలతో చేస్తున్నారని భజరంగ్ పునియా విమర్శలు చేశారు. రెజ్లర్లపై ఈ సంఘం అధ్యక్షుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ సాక్షి మాలిక్, వినేశ్ పోగట్ చేసిన ఆందోళనలకు భజరంగ్ పునియా కూడా మద్దతు తెలిపారు. వీరి ఆందోళనలతో రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్ భూషన్‌ను తప్పిచారు.