పునర్వినియోగ వాహకనౌక కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పుష్పక్ పేరిట స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV)03ని ఇస్రో విజయవంతంగా పరీక్షించి సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేసింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో , దాదాపు 320 కిలో మీటర్ల వేగంతో నేల మీదకు దిగిన పుష్పక్, సొంతంగా రన్ వే పై ల్యాండ్ అయినట్లు ప్రకటించింది. దానికదే వేగాన్ని నియంత్రించుకున్నట్లు వివరించింది. ఇప్పటికే రెండుసార్లు చేసిన ప్రయోగం విజయవంతం అవ్వగా మూడోసారి కూడా విజయం సాధించినట్లు ఇస్రో ప్రకటించింది.
పుష్పక్ అనేది ఓ పునర్వినియోగ లాంచ్ వెహకిల్. సింగిల్ స్టేజ్-టు-ఆర్బిట్ వాహనంగా దీనిని రూపొందించారు. ఎక్స్-33 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్ బెడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, అప్ గ్రేడ్ చేసిన డీసీ-ఎక్స్ ఏ ఫ్లైట్ డెమాన్స్ట్రేటర్ వంటివి ఇందులో పొందుపరిచారు. పుష్పక్లో ఫ్యూజ్ లేజ్, నోస్ క్యాప్, డబుల్ డెల్టా వింగ్స్, ట్విన్ వర్టికల్ టెయిల్స్ ఉంటాయని ఇస్రో తెలిపింది. ఎలెవోన్స్, రూడర్ అనే నియంత్రణ ఉపరితలాలను కూడా కలిగి ఉంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు