టీ20 ప్రపంచకప్‌లో అప్ఘనిస్తాన్ మరో రికార్డు క్రియేట్ చేసింది. గ్రూప్ స్టేజ్‌లో న్యూజీలాండ్‌ను ఓడించిన అప్ఘన్, సూపర్ 8 లో భాగంగా నేటి ఉదయం కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్‌పై విజయం సాధించడం అప్ఘన్ జట్టుకు ఇదే తొలిసారి.
తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేయగా ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) సత్తా చూపారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీయగా .. జంపా రెండు, స్టోయినిష్ ఒక్క వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో అప్ఘన్ బౌలర్ల ధాటికి ఆసీస్ చతికలబడింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59) మినహా మిగతా వారు విఫలం కావడంతో ఆసీస్ జట్టు 127 పరుగులకు పెవిలియన్ చేరింది. గుల్బాదిన్ నైబ్ నాలుగు వికెట్లు తీయగా. నవీనుల్ హక్ మూడు, నబీ, రషీద్ ఖాన్, ఒమర్జాయ్ లు తలా ఒక వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
నేటి మ్యాచ్ లో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ దుమ్ము రేపాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన కమిన్స్ మరోమారు హ్యాట్రిక్ నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు.
నేటి మ్యాచ్ లో 18వ ఓవర్ చివరి బంతికి రషీద్‌ఖాన్‌ను ఔట్ చేసిన కమిన్స్ ఆ తర్వాతి 20వ ఓవర్లో తొలి బంతికి కరీమ్ జనత్ (13)ను అవుట్ చేసి ఆ తర్వాతి బంతికి గుల్బాదిన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపాడు.