టి20 ప్రపంచకప్-2024 టోర్నీ సూపర్–8 లో భాగంగా రెండో మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్, సెమీస్ పోరుకు చేరడం లాంఛనమే.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా… భారత్ 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (50 నాటౌట్), విరాట్ కోహ్లి (37), రిషభ్ పంత్ ( 36), శివమ్ దూబే ( 34) అదరగొట్టారు.
బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 146 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నజు్మల్ హుస్సేన్ (40), తన్జీద్ హసన్ ( 29) మాత్రమే పోరాడాడు. లిటన్ దాస్ (13) విఫలమవగా, తౌహీద్ హ్రిదయ్ (4), షకీబ్ (11), మహ్ముదుల్లా (13) చేతులెత్తేశారు. రిషాద్ ( 24) ఫర్వాలేదనిపించాడు .
భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లు తీయగా బుమ్రా, అర్ష్ దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్–8 దశలో భారత్ చివరి మ్యాచ్ ను సోమవారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.