తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును ఎంపిక చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యువతకు పెద్దపీట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించిన లావు, 2019లో వైసీపీ నరసరావుపేట ఎంపీగా గెలిచారు.అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. జాతీయ రహదారులకు 3 వేల కోట్ల నిధులను తీసుకు వచ్చారు. వడికలసెలపూడి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు సాధించారు.2024లో టీడీపీ చేరి నరసరావుపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన లావు శ్రీకృష్ణదేవరాయలుకు నిజాయితీపరుడిగా మంచి పేరుంది. వైసీపీలో ఇమడలేక టీడీపీలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయనకు కీలక పదవి దక్కింది. ఇక అమలాపురం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన హరీశ్‌కు పార్లమెంట్లో టీడీపీ విప్ పదవి లభించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు