అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా వైద్యవిద్యార్థిని అంబుల వైష్ణవిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరుజిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అమరావతి రాజధానికి రూ.25 లక్షలు, పోలవరం నిర్మాణానికి లక్ష రూపాయలు దానం చేశారు. తనకున్న మూడెకరాలు భూమిలో ఎకరం అమ్మి అమరావతి రాజధాని నిర్మాణానికి ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యావిద్యార్థిని అంబుల వైష్ణవికి సీఎం శాలువా కప్పి సన్మానం చేశారు.
అమరావతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డాక్టర్ అంబుల మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. తన కూతురు అంబుల వైష్ణవిని అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై ఆయన ముఖ్యమంత్రికి ధన్యావాదాలు తెలిపారు. రాజధానికి, పోలవరం నిర్మాణానికి తమ వంతు సాయం చేశామని ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.