ఎన్టీయే ప్రక్షాళన, పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు నెలల్లో దర్యాప్తు నివేదికను కమిటీ అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పరీక్షలను సక్రమంగా, న్యాయబద్ధంగా నిర్వహించడం, యంత్రంగాన్ని మెరుగుపరచడం, డేటా సెక్యూరిటీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై సిఫారసులు చేయనుంది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, దిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
యూజీసీ నెట్ లీకేజీ, నీట్ అవకతవకలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యామంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.