అయోధ్య బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి పండిట్ లక్ష్మికాంత్ దీక్షిత్
86వ ఏట కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని దీక్షిత్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆయన అంత్యక్రియలు కాశీలోని మణికర్నిక ఘాట్‌లో నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన దీక్షిత్ పూర్వీకులు కాశీలో స్థిరపడ్డారు. కాశీవిశ్వనాధుని దేవాలయంలో పూజారిగా దీక్షిత్ సేవలందించారు. అయోధ్య రామాలయానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాన పూజారిగా చేశారు.
పండిట్ లక్ష్మికాంత్ దీక్షిత్ మరణం పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ దాస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భాషాప్రియులకు తీరనిలోటన్నారు. సంస్కృతంలో దీక్షిత్ పాండిత్యాన్ని యోగి కొనియాడారు. పండిట్ లక్ష్మికాంత్ దీక్షిత్ ఆత్మకు శాంతి కలగాలని యోగి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.