రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా సూర్‌సాగర్‌లో శుక్రవారం హిందువులపై ముస్లిములు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు హిందువులపై ముస్లిములు రాళ్ళు రువ్వి పలువురిని గాయపరిచారు. ఆ ఘటన కారణంగా కొన్ని గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హింసాకాండకు పాల్పడిన ముస్లిములు ఒక దుకాణానికి నిప్పు పెట్టారు. జోధ్‌పూర్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ముస్లిములు పోలీసులపై పెట్రోలు బాంబులు కూడా విసిరారు. దాంతో పోలీసులు అదనపు బలగాలను పిలిపించాల్సి వచ్చింది. చాలాసేపటికి గానీ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోలేదు.
జోధ్‌పూర్‌లోని రాజారాం స్క్వేర్‌లో ఒక స్థలంపై చాలాకాలంగా వివాదం నెలకొని ఉంది. ఆ స్థలంలో ముస్లిములు అక్రమంగా ఈద్గా నిర్మించారు. దాంతో ముస్లిములు, హిందువులు 15 ఏళ్ళ క్రితం ఒక ఒప్పందానికి వచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త నిర్మాణాలూ చేయకూడదన్ననదే ఆ ఒప్పందం. దాన్ని ఉల్లంఘిస్తూ ముస్లిములు తాజాగా అక్రమంగా నిర్మాణం చేయడం మొదలుపెట్టారు. ఆ చర్యలను హిందువులు వ్యతిరేకించారు. నిర్మాణ కార్యక్రమాలను వెంటనే ఆపేయాలంటూ ఆందోళనకు పాల్పడ్డారు. దాన్ని సహించలేని ముస్లిములు, హిందువులపై రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఘర్షణ మొదలైంది.
శుక్రవారంనాడు ముస్లిములు ఈద్గా ప్రహరీగోడకు తలుపులు బిగించారు. ఆ విషయాన్ని హిందువులు శుక్రవారం సాయంత్రం గమనించారు. ఏ నిర్మాణమూ చేయకూడదన్న ఒప్పందం ఉండగా తలుపులు ఎలా బిగిస్తారంటూ తమ వ్యతిరేకత వ్యక్తం చేసారు. ఆ తలుపులను తీసేయడానికి ప్రయత్నించారు. వారిపై ముస్లిములు దాడికి పాల్పడ్డారు. అలా, ఆ ఘర్షణ హింసాత్మకంగా మారింది.
ఆ వ్యవహారంలో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. దాంతో అధికారులు వేగంగా స్పందించారు. లాఠీలతో గుంపును చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని దుండగులు ఒక ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. ఎట్టకేలకు పోలీసులు 4-5 రౌండ్లు బాష్పవాయువు ప్రయోగించారు. అదనపు బలగాలను సైతం మోహరించాల్సి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చింది. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఆ ఘటనకు సంబంధించి సుమారు 20మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరుపక్షాలూ ఒకరిపై ఒకరు ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేసారు. మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసారు.
సాయంత్రం నుంచే వివాదం మొదలవడంతో రెండు పక్షాల నుంచీ ఐదుగురు ప్రతినిధులతో బృందాలను ఏర్పాటు చేసి, వారితో పోలీసులు చర్చలు జరిపారు. చివరికి, వివాదానికి దారితీసిన తలుపులను మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకైనా మంచిదని పోలీసులు అక్కడ కాపలా ఉన్నారు.
రాత్రి 10.15 గంటల సమయంలో ఉన్నట్టుండి ఓ డజను మంది ముస్లిములు రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. ముస్లిములను ప్రతిఘటిస్తూ హిందువులు కూడా రాళ్ళు రువ్వారు. దాంతో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ క్రమంలో ఒక దుకాణానికి నిప్పు పెట్టారు. ఆ మంటలు పక్కనే ఉన్న ఇంటి వరకూ వ్యాపించాయి. ఆ ఇంటి గేటు దహనమైపోయింది.
విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ రాజేంద్రసింగ్, డిసిపిలు అలోక్ శ్రీవాస్తవ, శరద్ చౌధురి, అదనపు పోలీసు బలగాలను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటే అగ్నిమాపక శకటాలు కూడా చేరుకున్నాయి.
సూరసాగర్ ఎంఎల్ఎ దేవేంద్ర జోషి, నగర ఎంఎల్ఎ అతుల్ భన్సాలీ ఇద్దరూ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు వివరించారు.
‘‘సాయంత్రం ఒక గొడవ జరిగింది. అది సద్దుమణిగింది. కానీ రాత్రి మళ్ళీ గొడవ మొదలైంది. అప్పుడే రాళ్ళు రువ్విన ఘటన చోటు చేసుకుంది. గతంలో కిషన్‌గఢ్, పాలీ ప్రాంతాల్లో ఇలాంటి గొడవలే జరిగాయి. ఇలా పదేపదే జరుగుతున్న గొడవలు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనాలు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం అమలుచేస్తున్న కుట్రలా అర్ధమవుతోంది. మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి గొడవలు పెడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్య తీసుకోవాలి’’ అని ఎంఎల్ఎ దేవేంద్ర జోషి అన్నారు.
ఈ ఘటనలో పలువురికి చిన్నచిన్న గాయాలయ్యాయి. ఇనస్పెక్టర్ నితిన్ దవేకు ఒకమోస్తరు గాయాలయ్యాయి. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక యువకుడు గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించి సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు