సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో 12 సార్లు వచ్చే ఈ తిథి రోజున వ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నదీ స్నానాలు చేయడం భారతదేశంలో సంప్రదాయంగా వస్తోంది. ప్రతీ పౌర్ణమికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుండగా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు పవిత్ర నదులలో స్నానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని విశ్వాసం.
ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి తిథి జూన్ 21న ఉదయం 6:01 నుంచి జూన్ 22 ఉదయం 5:07 వరకూ ఉంటుంది. అయోధ్యకు పోటెత్తిన లక్షలాది మంది సరయూ నదిలో స్నానాలు చేశారు. . ఈ రోజు సరయూ నది భూమిపైకి వచ్చిందని పలు శాస్త్రల్లో పేర్కొన్నారు. దీంతో సరయూ జయంతిగా భావించి పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా అధికారులు సరయూ ఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.