అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. గడచిన మూడు రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకు 4 లక్షల మంది ప్రజల నిరాశ్రయులయ్యారు. 37 మంది చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. ముఖ్యంగా కామరూప్, తముల్పూర్, హైలకండి, ఉదాల్గురి,హజోయి, బార్పేట, బిస్వనాథ్, నల్బారి, బొంగాయ్గావ్, బక్షా, కరీంగంజ్, సౌత్ సల్మారా, గోల్పోరా, డర్రాంగ్, బాలాజి, నాగోన్, కాచర్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
అస్సాంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో రవాణా స్థంభించిపోయింది. కోపిలి, కాంపూర్, థరంతుల్, బరాక్, బీపీ ఘాట్, కుషీయాత్ర, కరీంగంజ్ ప్రాంతాల్లో నదులు పొంగిపొర్లుతున్నాయి.కరీంగంజ్ జిల్లాతీవ్రంగా నష్టపోయింది. ఈ జిల్లాలోనే 2 లక్ష మంది గూడు కోల్పోయారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే 100 శిబిరాలు ప్రారంభించింది. మరో 115 కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ శిబిరాల్లో వేలాది మంది ఆశ్రయం పొందుతున్నారు.అస్సాంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు రెండు వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు