భారత సంతతి పారిశ్రామిక వేత్త ప్రకాశ్ హిందుజా ఆయన కుటుంబ సభ్యులకు స్విట్జర్లాండ్ కోర్టు జైలు శిక్ష విధించింది. భారత్ నుంచి కొంత మంది నిరక్షరాస్యులను స్విట్జర్లాండ్‌లోని హిందూజా అధినేత ప్రకాశ్ ఇంట్లో అక్రమంగా రోజుకు 18 గంటలు పనిచేయించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనాలు ఇవ్వడం, ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నారని స్విట్జర్లాండ్ కోర్టు ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్, కొడుకు అజయ్,కోడలు నమ్రతకు జైలు శిక్ష విధించింది. విచారణ జరిగే సమయంలో వీరు కోర్టులో హాజరుకాలేదు. వీరి తరపున మేనేజర్ హాజరయ్యారు. గతంలో మేనేజర్‌కు స్విస్ కోర్టు 18 నెలలు జైలు శిక్ష విధించింది.
హిందుజా కుటుంబంపై 2007లోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో పనిచేసేవారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతోపాటు, స్విస్ కరెన్సీలో కాకుండా భారత కరెన్సీలో పనివారి కుటుంబసభ్యుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నారనే అభియోగాలున్నాయి. పన్నుల ఎగవేత కేసుల్లోనూ హిందుజా కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది.