టీ20 ప్రపంచకప్ -2024 టోర్నీ సూపర్-8లో దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఛేదించడంతో ఘోరంగా విఫలమైంది.20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగల్గింది.
హారీ బ్రూక్ 37 (53), లియామ్ లివింగ్ స్టోన్ (33) జరిగిపోయింది. జట్టులో వీరిద్దరు మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో రబడ, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు చక్కని ఆరంభం లభించింది. డికాక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే దక్షిణఫ్రికా 63 పరుగులు చేసింది. మొత్తం 38బంతులు ఆడిన డికాక్ 65 పరుగులు చేశాడు. క్లాసెన్ (8), కెప్టెన్ మార్కరమ్ (1), మార్కో జాన్సన్ (0) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
డేవిడ్ మిల్లర్ 43 పరుగులు చేశాడు. ఓపెనర్ హెండ్రిక్స్ 19 పరుగులు చేశాడు. సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్కు మూడు వికెట్లు తీశాడు.
సూపర్-8లో వరుసగా రెండు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా సెమీస్కు చేరువైంది. టోర్నీలో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య సూపర్-8 పోరు జరగనుంది.