అక్రమ నిర్మాణాలపై తాడేపల్లి మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. తాడేపల్లి బోట్ యార్డులో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తోన్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని ఇవాళ తెల్లవారుజామున కూల్చి వేశారు. నీటిపారుదల శాఖకు చెందిన బోట్ యార్డ్ స్థలంలో రెండున్నర ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన భవనాలను 6 పొక్రెయినర్లతో కూల్చి వేశారు.
వైసీపీ కార్యాలయం కూల్చివేయబోతున్నారంటూ మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి శుక్రవారంనాడు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు తీర్పు చెప్పడంతో చర్యలు మొదలు పెట్టారు. దాదాపు రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ భవనానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తాడేపల్లి మున్సిపాలిటీ అధికారులు మీడియాకు వెల్లడించారు.