దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఆమెకు గతంతో విధించిన కస్టడీ నేటితో ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు ఈడీ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగించారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న అరెస్టు చేశారు. తొలుత ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. దాదాపు నాలుగు నెలలుగా కవిత తిహార్ జైలులోనే ఉన్నారు.