పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. తమను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ కొందరు వాలంటీర్లు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు తమను బెదిరించి, బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్లు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం 2019లో 2.76 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వారి సేవలను ఉపయోగించుకున్నారు. ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకోరాదని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో వారితో రాజీనామాలు చేయించారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వాలంటీర్లను మరలా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.