సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతోంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయగా ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం ఆ తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. తర్వాత మహిళ శాసనసభ్యులు అక్షరక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మిగతావారు అక్షరక్రమంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు.
సభ్యులకు ప్రస్తుతానికి అధికారికంగా సీట్లు కేటాయించలేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత సభాధ్యక్షుడు సీట్లు కేటాయిస్తారని ప్రొటెం స్పీకర్ తెలిపారు.
శాసనసభలో చంద్రబాబు రెండేళ్ళ తర్వాత అడుగుపెట్టారు. వైసీపీ హయంలో ప్రతిపక్షనేతగా ఉన్నచంద్రబాబు, తనను పాలకపార్టీ నేతలు తీవ్రంగా కించపరిచారని సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేసి బయటకు వెళ్లారు. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన శపథం నెరవేరింది. శాసనసభకు వచ్చిన చంద్రబాబు తొలుత మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు