తమిళనాడు కల్తీసారా మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి చనిపోయిన వారి సంఖ్య 40కు చేరింది.109 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాద ముందని తెలుస్తోంది. సారాలో మిథనాల్ కలిపి తాగడం వల్లే చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కరుణాపురంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చిన వారు సారాలో కలపిన మిథనాల్ తాగడంతో చనిపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కల్తీసారా ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్, తొమ్మిది మంది అధికారులను బదిలీ చేశారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు.
కల్తీసారా తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపు 1000 ప్రాంతాల్లో దాడులు చేసి వందలాది మందిని అరెస్ట్ చేశారు. నాటుసారా తయారీదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.