ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌లోని షేర్ ఏ కశ్మీర్ వద్ద నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం దాల్ సరస్సు వద్ద ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా చివరి గంటలో ప్రధాని కార్యక్రమాన్ని షేర్ ఏ కశ్మీర్‌కు మార్చారు.ప్రధాని మోదీ యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. పదేళ్ల కిందట ప్రధాని మోదీ యోగా దినోత్సవం ప్రారంభించిన తరవాత ప్రపంచంలో అనేక దేశాధినేతలు యోగా గురించి తనను అడుగుతున్నారని చెప్పారు.
ప్రపంచంలో అనేక దేశాల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగ ప్రదేశాల్లో యోగాసనాలు వేశారు. పలువురు ప్రముఖులు యోగా దినోత్సవాల్లో పాల్గొన్నారు. విదేశాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది పార్కులు, బహిరంగ ప్రదేశాలు, విశాలమైన క్రీడా మైదానాల్లో ఆసనాలు వేశారు. యోగాపై పరోశోధలు జరుగుతున్నాయని, మంచి ఫలితాలు వస్తున్నట్లు అంతర్జాతీయ సైన్స్ పత్రికలు ప్రచురించాయని పలువురు యోగా గురువులు గుర్తుచేశారు.