వైసీపీ నేత,మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. తీర్పు వెలువడే వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించారు. ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్ యంత్రం పగలగొట్టడంతోపాటు, టీడీపీ ఏజంట్‌పై పిన్నెల్లి అనుచరులు దాడికి దిగిన కేసుతో సహా, పలువురి ఫిర్యాదులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
మాచర్ల మాజీ ఎమ్మెల్యేపై కారంపూడి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ తెరిచినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు నిఘా పెట్టారు. పిన్నెల్లిపై ఇప్పటికే రెండు మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు.