తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీమద్యం తాగి మరణించిన వారి సంఖ్య 34కు పెరిగింది. మృతుల కుటుంబాలకు, ఇతర బాధితులకు రాష్ట్రప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంక్వైరీ కమిషన్ను ఆదేశించారు.
కల్లకురిచి కల్తీమద్యం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 10లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. ఆ ఘటనలో ఆస్పత్రి పాలైన వారికి ఒక్కొక్కరికీ రూ.50వేలు పరిహారం ప్రకటించారు.
కల్తీ మద్యం ఘటనలో మొత్తం 107మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 48మందిని కల్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రిలో చేర్చారు. 59మందిని సేలం, విల్లుపురం, పుదుచ్చేరి వంటి ప్రాంతాలకు తరలించారు.
ఈ సంఘటనకు నిరసనగా తమిళనాడు బిజెపి నిరసన చేపట్టనుంది. స్టాలిన్ సర్కారు నిర్లక్ష్యధోరణికి నిరసనగా రాష్ట్రమంతటా జూన్ 22న నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె అన్నామలై ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటనపై అర్జెంట్ పిటిషన్ను స్వీకరించి విచారణ ప్రారంభించాలని మద్రాస్ హైకోర్టును అన్నాడిఎంకె న్యాయవాదులు కోరారు. దానికి కోర్టు అంగీకరించింది. రేపు శుక్రవారం అంటే జూన్ 21న విచారిస్తామని జస్టిస్ డి కృష్ణకుమార్, కె కుమరేష్ బాబులతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు