పశ్చిమ బెంగాల్లో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం మరోసారి బహిర్గతమైంది. రాజ్‌భవన్‌లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జి అధికారి, ఆయన బృందంతో తనకు వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందన్నారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంపై సీఎం మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై పోలీసుల నిఘాను ఆయన తప్పుబట్టారు.
రెండురోజుల కిందట రాజ్‌భవన్ పోలీసులపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారిక నివాస పరిసరాలను విడిచివెళ్లిపోవాలని ఆదేశించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన దాడుల బాధితులతో కలిసి గవర్నర్ ను కలిసేందుకు వచ్చిన అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమన్నారు. ఈ ఘటనపై సువేందు కోర్టును ఆశ్రయించారు. అనుమతి ఉంటే లోనికి రాజ్ భవన్ లోపలికి పంపిచాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పరిణామాల తర్వాత పోలీసుల తీరుపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.