వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం లీకుపై అనుమానాలు బలపడుతున్నాయి. నీట్ యూజీ 2024 పరీక్షాపత్రం లీక్పై బిహార్ పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో కొందరు విద్యార్థులను విచారణ చేశారు. మేము కోటాలో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్నాం. పరీక్షకు మూడు రోజుల ముందు మా మామ ఫోన్ చేసి, ఇంటికి విచ్చేయమన్నాడు. పరీక్ష ముందు రోజు కొన్ని జవాబులు ఇచ్చాడు. వాటిని బట్టీపట్టాం. తరవాత రోజు నీట్ పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చాయంటూ ఓ విద్యార్థి పోలీసుల ముందు అంగీకరించాడు. అతనితో రాతపూర్వకంగా అంగీకారం తీసుకుని పంపించి వేశారు.
దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో వందలాది పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకు పంపాలని పిటిషన్ ఆదేశించింది. నీట్ పరీక్షలను మరలా నిర్వహించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నీట్ పరీక్షల్లో అవకతవకలపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని ఆదేశించింది.