దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థ ఐఐటిలో విద్యార్థులు దారి తప్పుతున్నారు. గత మార్చిలో జరిగిన ఐఐటి బాంబే వార్షికోత్సవాల్లో విద్యార్థుల ప్రదర్శనలు దారితప్పాయి. రామాయణాన్ని వక్రీకరించి జోకులుగా స్కిట్ వేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఐఐటి అధికారులు విద్యార్థులపై చర్యలకు ఉపక్రమించారు. రామాయణంలోని రాముడు, సీత, ఆంజనేయుడు పేర్లు నేరుగా పెట్టుకపోయినా, అసభ్యంగా జోకులు వేయడంపై అధికారులు కఠిన చర్యలకు దిగారు.
రామాయణం స్కిట్ చేసిన విద్యార్థులపై ఒక్కొక్కరికి లక్షా 20వేల ఫైన్ వేశారు. ఇది విద్యార్థుల ఒక సెమిస్టర్ ఫీజుతో సమానం. భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలు జరక్కుండా తగిన జాగ్రత్తలు పాటించాలని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇతిహాసాలను కించపరిచేలా విద్యాసంస్థల వార్షికోత్సవాల్లో స్కిట్లు వేయడాన్ని నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.