విమానం ఇంజన్లో చెలరేగిన మంటలు తీవ్ర సంచలనంగా మారాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన పావుగంటకే ఇంజన్లో మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలో దింపేందుకు అనుమతి కోరారు. విమానంలో మంటలు గుర్తించిన ఏటీసీ సిబ్బంది వెంటనే దిగేందుకు అనుమతి ఇచ్చారు. అయితే విమానం ట్యాంకులో నిండుగా ఇంధనం ఉండటంతో ఫైలెట్ మూడు గంటల పాటు విమానాన్ని చక్కర్లు కొట్టించారు.
అర్థరాత్రి ఒంటిగంటకు శంషాబాద్ నుంచి కౌలంలంపూర్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో మంటలను ఫైలెట్ గుర్తించారు. దించే ప్రయత్నం చేశారు. వెంటనే అనుమతి లభించినా దించింతే విమానం మంటల్లో కాలిపోయే ప్రమాద ఉండటంతో ఇంధనం తగ్గేవరకు దాదాపు మూడు గంటలపాటు విమానాన్ని హైదరాబాద్ నగరంపై తిప్పారు. చివరకు తెల్లవారుజామున 4 గంటలకు సురక్షితంగా దింపారు. దీంతో 130 మంది ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.