ఏపీ కొత్త డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1989 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం, ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీలో పనిచేస్తోన్న సీనయర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ద్వారకా తిరుమలరావు అనేక పదవుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.1989లో కామారెడ్డిలో కెరీర్ ప్రారంభించిన తిరుమలరావు ఆ తరవాత నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరవాత విజయవాడ సీపీగా సేవలందించారు.అక్టోపస్‌లోపూ కీలక పదవులు చేశారు. విజయవాడ రైల్వే పోలీస్ డివిజన్ అధికారిగా సేవలందించారు.
ద్వారకా తిరుమలరావుకు ముక్కుసూటి మనిషిగా పేరుంది. అవినీతికి తావులేని అధికారిగా గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హరీష్ గుప్తాను డీజీపీగా నియమించారు. ఆయన నెలన్నరగా డీజీపీగా చేశారు. ఇక నుంచి పూర్తి బాధ్యతలు ద్వారకా తిరుమలరావుకు ప్రభుత్వం అప్పగించింది. ఈయన ఈ పదవిలో 2 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.