పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి కిందట ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది విజయం సాధించారు. ఎన్డీయే మద్దతుతో ఆ పార్టీ అభ్యర్థులు లోక్ సభకు పోటీ చేసిన రెండు చోట్ల జనసేన జయకేతనం ఎగురవేసింది.
ఏపీ ఎన్డీయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రిగా అవకాశం లభించింది. నేడు విజయవాడలోని క్యాంపు కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించి, డిప్యూటీ సీఎం హోదాలో పలు ఫైళ్ళపై సంతకాలు చేశారు. పంచాయతీ రాజ్, పర్యావరణం, అటవీ, గ్రామీణ నీటిపారుదలశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
పవన్ కళ్యాణ్ కు జనసేన ముఖ్యనేత నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకారణోత్సవం సందర్భంగా విజయవాడ దుర్గగుడి వేదపండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనం అందజేశారు.