టీ20 ప్రపంచకప్ టోర్నీలో వెస్టిండీస్ మరోసారి సత్తా చాటింది. లీగ్ లోని ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో అప్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. సూపర్-8 సమరానికి సిద్ధమైంది.
పూరన్ 53 బంతుల్లో 98 పరుగులు చేయగా చార్లెస్, 27 బంతులు ఆడి 43 పరుగులు చేశాడు. విండీస్ 5 వికెట్లు నష్టపోయి 218 పరుగులు చేసింది. నైబ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఛేదనలో అప్ఘనిస్తాన్ పూర్తిగా విఫలమైంది. విండీస్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు తీయగా అకీల్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడంతో 16.2 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన విండీస్ గ్రూప్-సిలో అగ్రస్థానం సాధించింది. మూడు విజయాలతో అప్ఘనిస్తాన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి.