ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సాధారణ మానవులకు ఇబ్బంది కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఒక చెరకు రసం దుకాణం యజమాని, రసంలో ఉమ్మి వేసి విక్రయిస్తున్న విషయం బైటపడింది. కొనుగోలుదారుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు ముస్లిములను అరెస్ట్ చేసారు.
నోయిడా సెక్టార్ 121లోని క్లియో కౌంటీ సొసైటీ ఎదురుగా చెరకు రసం స్టాల్ ఉంది. జూన్ 15న క్షితిజ్ భాటియా తన భార్యతో అక్కడ చెరకు రసం తాగడానికి ఆగాడు. రెండు గ్లాసుల రసం ఆర్డర్ ఇచ్చారు. దుకాణదారుడు రెండు గ్లాసుల రసంలో ఉమ్మి వేసి దాన్ని కలిపి కొనుగోలుదారులకు అందించాడు. ఆ చర్యను కళ్ళారా చూసిన క్షితిజ్ భాటియా ఆ రసం తమకు వద్దని నిరాకరించాడు. దాంతో దుకాణదారుడు వారిద్దరినీ దూషించి, డబ్బులివ్వకపోతే కుదరదంటూ బెదిరించాడు. ఆ వ్యవహారంతో చిరాకుపడిన క్షితిజ్ భాటియా, పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
వినియోగదారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, కేసు నమోదు చేసారు. షాహెబ్ ఆలమ్, జంషెడ్ఖాన్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు.
నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్కు చెందినవారు. ఉపాధి కోసం నోయిడా వచ్చారు. క్లియో కౌంటీ సొసైటీ ఎదురుగా చెరకు రసం స్టాల్ పెట్టుకున్నారు. వారు ఎంతకాలం నుంచి ఇలా చెరకు రసంలో ఉమ్మి వేసి కలిపి అమ్ముతున్నారో తెలియదు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా నివారించడం కోసం పోలీసులు వారిని నిర్బంధించి విచారణ చేస్తున్నారు.
కొద్దికాలం క్రితం ఇటువంటిదే మరో సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో వెలుగు చూసింది. ఒక క్షౌరశాలలో పనిచేసే యువకుడు ఫేషియల్ మసాజ్ చేయించుకోడానికి వచ్చిన యువకుడి ముఖంపై ఉమ్మి ఊసాడు. ఆ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఆ చర్యకు సాక్ష్యం లభించింది. దాంతో ఆ క్షురకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు.
ప్రతీ వస్తువు పైనా ఉమ్మి వేసే పద్ధతిని పాటిస్తున్న ముస్లిముల వల్ల సాధారణ పౌరులకు తీవ్రమైన అసౌకర్యం, అసహ్యం కలుగుతున్నాయి. తద్వారా అటువంటి చర్యలకు పాల్పడుతున్న ముస్లిములపై ఆగ్రహం పెచ్చుమీరుతోంది.