వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతోన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పరీక్షల్లో ఇసుమంత లోపం ఉన్నా వెంటనే సరిదిద్దుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నీట్ పరీక్షల్లో లోపాల వల్ల అర్హత లేని వారు వైద్యులుగా తయారైతే భవిష్యత్ భయానకంగా ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నీట్ పరీక్షల నిర్వహణలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలని, లోపాలను అంగీకరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని ఆదేశించింది. నీట్ పరీక్షలు రద్దు చేయాలంటూ చాలా మంది సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నీట్ పరీక్షల కోసం లక్షలాది విద్యార్థులు ఎంత కష్టపడుతారో గుర్తుంచుకుని, భవిష్యత్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచలను చేసింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు