ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌భమ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. రాజధాని రాంచీకి 200 కి.మీ. దూరంలో దట్టమైన లిపుంగా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఓ మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అత్యాధునిక ఇన్సాస్ రైఫిల్. మూడు తుపాకులు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.
చనిపోయిన వారిలో సబ్ కమాండర్ సింగ్ రాయ్ ఉన్నారు. అతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జోనల్ కమాండర్, ఏరియా కమాండర్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హత మయ్యారు. ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గత రెండు మూడు నెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు వంద మంది మావోయిస్టులు హతమయ్యారు.