ఎయిరిండియా ప్రయాణీకుడికి ఘోర అనుభవం ఎదురైంది. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సికో విమానంలో ప్రయాణీకుడికి ఎయిరిండియా అందించిన ఆహారంలో బ్లేడ్ ముక్క దర్శన మిచ్చింది. అదృష్ణవశాత్తూ ఆ ప్రయాణీకుడు బ్లేడ్‌ను గమనించడంతో దాన్ని ఏరివేశాడు. పాల్ అనే జర్నలిస్టుకు ఈ అనుభవం ఎదురైంది. అతని ఆహారంలో వచ్చిన బ్లేడ్ ఫోటో తీసి ఎక్స్‌లో ఫోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో ఎయిరిండియా అధికారులు స్పందించారు.
ఎయిరిండియాకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టరుపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆహారం తయారు చేసే యంత్రంలోని బ్లేడ్ ఊడిపోయి ఆహారంలో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కూరగాయలు తరిగే యంత్రంలోని బ్లేడ్ తినే ఆహారంలోకి రావడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.