రైలు ప్రమాద మృతుల సంఖ్య 15కు చేరింది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో కాంచనఝంఘా ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి ఓ గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. 60 మందిపైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు ప్రకటించారు.
రైలు ప్రమాద ఘటన విషయం తెలియగానే ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటన చాలా దురదృష్ణకరమంటూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంపై రైల్వే శాఖ సహాయమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ స్పందించారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.