దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మూడు వన్డేల క్రికెట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. తొలి వన్డేలో భారత జట్టు 143 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్మృతి మంధాన 127 బంతుల్లో 117 పరుగులతో సెంచరీ చేసింది. ఆశ శోభన 4, దీప్తిశర్మ 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను 37.4 ఓవర్లకే ఆలౌట్ చేశారు. దక్షిణాఫ్రికా జట్టులో సన్ లజ్ 33 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు తడబడింది. తొలి ఓవర్లోనే వోల్వార్ట్ వెనుతిరిగారు. 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కేవలం 21 పరుగులు చేయగలిగింది. 21 ఓవర్లకు 71 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తరవాత వేగంగా వికెట్లు కోల్పోయింది. శోభన నాలుగు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి అంచుకు చేరింది. దక్షిణాఫ్రికా జట్టులో జాఫ్టా 27 పరుగులతో పోరాడినా వారికి ఫలితం దక్కలేదు.