ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాలోని రఫాలో పగటిపూట కాల్పుల విమరణ ప్రకటించింది. రఫాలో 12 కిలోమీటర్ల పరిధిలో లక్షలాది మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆహారం, నీరు అందక అల్లాడిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
రఫాలో మానవతా సాయం అందించేందుకు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడనుంది. పగటి పూట ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పుల విరమణ అమలు కానుంది. దీంతో రఫాలోకి ఆహారపు ట్రక్కులు ప్రవేశించడానికి లైన్ క్లియర్ అయింది.