రాష్ట్రంలో వానలు పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.రానున్న మూడు రోజుల పాటు మరింత విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలో మరింతగా విస్తరిస్తున్నాయి.
దీంతో నేడు, సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని,గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.