బిహార్ రాజధాని పాట్నాలో ఘోరం జరిగింది. గంగానదిలో 17 మంది భక్తులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. 11 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా మిగతా వారు గల్లంతయ్యారు. ఆరుగురు నదిలో గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు.
గంగానది పరీవాహక ప్రాంతమైన బాఢ్ గ్రామానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చాదరు. గంగా దసరా పండుగ సందర్భంగా నదిలో స్నానం చేసి అవతలి ఒడ్డుకు చేరుకునేందుకు పయనం అయ్యారు. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత పడవ మునిగిపోయింది. పదకొండు మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా మిగతా వారు మునిగిపోయారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడింతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.